మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Oct 12, 2020 , 23:37:55

వీటిని చూస్తే బీపీ మాయం!

వీటిని చూస్తే బీపీ మాయం!

పెంపుడు జంతువులతో గడిపితే మానసిక ప్రశాంతత మెరుగుపడుతుందని చాలా కాలం నుంచీ శాస్త్రవేత్తలు చెబుతున్న విషయమే. వాళ్లు చెప్పకపోయినా మనకు అనుభవంలోకి వచ్చే సందర్భమే. కానీ ఇప్పటి ఉరుకులపరుగుల జీవితంలో, అపార్టుమెంటు సంస్కృతిలో పెంపుడు జంతువులే కరువైపోతున్నాయి కదా! ఇందుకో ప్రత్యామ్నాయం లేకపోలేదని అంటున్నారు... బ్రిటన్‌లోని లీడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. అధ్యయనంలో భాగంగా వాళ్లు కొంతమందికి, జంతువుల వీడియోలను చూపించారు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో కనిపించే క్వొక్కా అనే జీవికి సంబంధించిన వీడియోలు చూపారు. క్వొక్కా వింత ముఖకవళికలు భలే నవ్వు తెప్పిస్తాయి. ఇలాంటి వీడియోలు చూసినవారిలో సానుకూలమైన మార్పు రావడం గమనించారు కూడా. వారిలో గుండె వేగం నిదానించింది, రక్తపోటు 20 శాతం మేర తగ్గిపోయింది, ఇక ఒత్తిడి అయినే చెప్పనవసరం లేదు.


logo