బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Oct 12, 2020 , 00:59:23

అల్లం చేసే మేలు

అల్లం చేసే మేలు

వడ ఇష్టంగా తినాలంటే అంచుకు అల్లం పచ్చడి కావాల్సిందే. చప్పటి ఉప్మా కూడా  పంటికిందికి అల్లం రాగానే టేస్టీగా మారిపోతుంది. ఇక అల్లం టీ తాగితే ఉంటుందీ.. ఇలా సిప్‌ చేయగానే అలా అద్భుతః అనేస్తాం. చుక్క చుక్కలో అల్లం ఫ్లేవర్‌ను ఎంజాయ్‌ చేస్తూ, చాయ్‌ ఎక్కడ అయిపోతుందోనని మెల్లమెల్లగా తాగుతాం. జిహ్వకు రుచిని అందించే అల్లం.. శరీరానికి కావాల్సినంత మేలు చేస్తుంది. 

  • అల్లంలో నీటి శాతం ఎక్కువ. కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌-సి ఇలా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అల్లంలో ఉన్నాయి. రోగనిరోధకశక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొంటుంది. 
  • అల్లంలో యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఉన్నాయి. ఇవి అలర్జీలను దూరం చేస్తాయి. జలుబు, దగ్గును తగ్గిస్తాయి. ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
  • అల్లం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
  • నెలసరి సమయంలో అల్లం వాడితే పొత్తికడుపులో నొప్పి తీవ్రత తగ్గుతుంది. నెలసరి సమస్యలనూ నియంత్రిస్తుంది.
  • అల్లం జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అసిడిటీని అరికడుతుంది. బరువు తగ్గించడంలోనూ సాయపడుతుంది.
  • జలుబు చేసినప్పుడు అల్లం టీ తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. రోజుకు ఒకసారి అల్లం టీ తాగితే రుచితోపాటు మనసుకు సాంత్వన కూడా లభిస్తుంది.


logo