గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Oct 08, 2020 , 23:54:37

వినీ రామన్‌

 వినీ రామన్‌

ఆస్ట్రేలియాలో పేరు పొందిన భారతీయ ఫార్మసిస్టుల్లో వినీ రామన్‌ ఒకరు. తమిళనాడుకు చెందిన 26 ఏండ్ల వినీ  ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డారు. ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ప్రియురాలిగా ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. స్విమ్మింగ్‌, ట్రావెలింగ్‌లను ఎక్కువగా ఇష్టపడే వినీ ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌తో రెండేండ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరూ ఫారిన్‌ టూర్స్‌కి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒక సందర్భంలో మాక్స్‌వెల్‌ తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు అతనికి తోడుగా ఉండి, మానసిక ధైర్యాన్ని ఇచ్చారట వినీ. అప్పటి నుంచి వాళ్లిద్దరి స్నేహం ప్రేమగా బలపడింది. 2019 ఆస్ట్రేలియాక్రికెట్‌ అవార్డుల కార్యక్రమంలో మాక్స్‌వెల్‌ తన ప్రియురాలు వినీతో కలిసి రావడంతో వీళ్లిద్దరి పెండ్లీ..చర్చనీయాంశమైంది. ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ కూడా అయింది. త్వరలో ఇద్దరూ పెండ్లి చేసుకోబోతున్నారు. 


logo