గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Oct 07, 2020 , 02:42:19

‘నోబెల్‌'లో నయా చరిత్ర

‘నోబెల్‌'లో నయా చరిత్ర

అక్టోబరు నెల రాగానే ప్రపంచం దృష్టి మొత్తం ‘నోబెల్‌' బహుమతులపైనే ఉంటుంది.  ఈ అత్యున్నత పురస్కారం, ఎవరిని వరిస్తుందోనని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. 1901 నుంచీ ఈ ప్రతిష్ఠాత్మక బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటిదాకా మొత్తం 950 మంది 597 బహుమతులు అందుకున్నారు. మొత్తం ఆరు రంగాల్లో ‘నోబెల్‌ ప్రైజ్‌' ప్రకటిస్తున్నా, అత్యధికంగా 113 సార్లు అందించింది భౌతిక శాస్త్ర విభాగంలోనే. అయితే, ఇప్పటిదాకా కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే ఈ విభాగంలో నోబెల్‌ బహుమతి అందుకోగా, ఈ ఘనత సాధించిన నాలుగో మహిళగా ‘ఆండ్రియా మియా గెజ్‌' చరిత్ర సృష్టించారు. గతంలో మేరీ క్యూరీ (1903), గోపర్ట్‌ మేయర్‌ (1963), డోనా స్ట్రిక్‌ల్యాండ్‌ (2018) మాత్రమే ఫిజిక్స్‌లో నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. అమెరికాకు చెందిన ఆండ్రియా ఖగోళ శాస్త్రవేత్తగానే కాకుండా యూనివర్సిటీ ఆఫ్‌ లాస్‌ఏంజెల్స్‌లో ఫిజిక్స్‌, ఆస్ట్ట్రానమీ విభాగాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  విశ్వ కేంద్రంపై జరిపిన పరిశోధనకు గానూ, మరో ఇద్దరితో కలిసి నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. గతంలో న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతంలో, ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతంలో లోపాలున్నట్లు ప్రకటించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. 


logo