శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Oct 07, 2020 , 02:42:17

కోల్‌కతా భద్రం

కోల్‌కతా భద్రం

దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. పల్లెలు మొదలుకొని మహానగరాల దాకా ఆడవాళ్లకు రక్షణ అనేది లేకుండా పోతున్నది. ఈ క్రమంలో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలోని 19 మెట్రో నగరాల వారీగా మహిళలపై దాడుల కేసుల సంఖ్యను వెల్లడించింది. ఇందులో అతి తక్కువ కేసులు నమోదైన నగరంగా కోల్‌కతా మొదటి స్థానంలో నిలిచింది. 2019లో కోల్‌కతాలో కేవలం 14 కేసులు మాత్రమే నమోదైనట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో వెల్లడించింది. ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరు నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 12,902 కేసులు వెలుగుచూసినట్లు నివేదిక పేర్కొన్నది. ఆర్థిక రాజధాని ముంబైలోనూ 6,519 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక రాష్ర్టాలవారీగా ఉత్తర ప్రదేశ్‌ (59,853 కేసులు), రాజస్థాన్‌ (41,550 కేసులు), మహారాష్ట్ర (37,144 కేసులు) టాప్‌ త్రీలో ఉన్నట్లు వెల్లడించింది.