శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Oct 05, 2020 , 01:48:16

నడక సాగిద్దాం ఇలా..

నడక సాగిద్దాం ఇలా..

కరోనా కారణంగా ఎన్నో పనులు కుంటుబడ్డాయి. అందులో వాకింగ్‌ కూడా ఒకటి. ఓవైపు రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిన తరుణంలో వాకింగ్‌కు దూరమవ్వడం ఇబ్బందే! అయితే అన్‌లాక్‌ అధ్యాయాలు మొదలయ్యాక వాకింగ్‌ ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. పబ్లిక్‌ పార్కులు తెరుచుకోవడంతో జాగింగ్‌ జోరుగా సాగిస్తున్నారు. అయితే, ఆరోగ్యం కోసం చేసే వాకింగ్‌ అనర్థానికి దారి తీయకూడదంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.

  • వాకింగ్‌, జాగింగ్‌ సమయంలో గాలి ఆడనట్టు అవుతుంటుంది. అలాగని మాస్కు తీసి పక్కన పెట్టకండి. అలవాటైతే ఊపిరి తీసుకోవడంలో మాస్కు వల్ల ఏ సమస్యా ఉండదు.
  • పార్కుల్లో రద్దీ ఉంటే వాకింగ్‌కు స్వస్తి చెప్పి ఇంటిముఖం పట్టండి. వాకింగ్‌ చేయకుండా వెనక్కి వెళ్లలేం అనుకుంటే.. రద్దీకి దూరంగా నడక సాగించండి. అంతేగానీ, భుజాలు రాసుకుంటూ, అడ్డుగా ఉన్నవారిని దాటుకుంటూ జాగింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇతరులతో కనీసం 15 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తపడండి.
  •  లాఫింగ్‌ క్లబ్‌ విన్యాసాలకు, సామూహిక కసరత్తులకు ఇంకొన్నాళ్లు ఆగాలి.
  • పాత మిత్రుడు తారసపడ్డాడని వారితో కలిసి జాగింగ్‌కు ఉపక్రమించొద్దు. దూరం నుంచే పలకరించి మీ నడక మీరు కొనసాగించండి.


logo