బుధవారం 28 అక్టోబర్ 2020
Zindagi - Oct 05, 2020 , 01:48:22

స్వీట్‌ మెమొరీ

స్వీట్‌ మెమొరీ

హాయ్‌ ఫ్రెండ్స్‌! నా పేరు మణి సంస్కృతి. పదో తరగతి అయిపోయింది. నా పాఠశాల జీవితంలో ఎన్నో స్వీట్‌ మెమొరీస్‌ ఉన్నాయి. నేను మొదటి నుంచీ నా తరగతిలో ప్రథమ స్థానంలో వచ్చేదాన్ని. నాకు చదువుతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనటం అంటే ఎంతో ఇష్టం. మా పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాలలో నేను, నా మిత్రులు కలిసి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నాం. అందులో మాకు మొదటి బహుమతి వచ్చింది. అందుకు మా ఉపాధ్యాయులు మమ్మల్ని ప్రశంసించి,  అందరి ముందూ బహుమతి ఇచ్చినపుడు ఎంతో ఆనందం కలిగింది. నేను ఒకసారి మా గ్రామంలోని అన్ని పాఠశాలల స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో పాల్గొన్నాను. అందులోనూ  ప్రథమ స్థానం వచ్చినపుడు, మిగతా విద్యార్థులు నాకు అభినందనలు తెలిపారు. అప్పుడు పట్టరాని సంతోషం కలిగింది. ఇలాంటి మరెన్నో మధుర జ్ఞాపకాలను మా పాఠశాల నాకు అందించింది.

- మణి సంస్కృతి, ఎల్లారెడ్డి, జీవదాన్‌  హైస్కూల్‌

Previous Article The Cow’s Bell

logo