మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Oct 04, 2020 , 00:32:30

4 ఆకుల మొక్క..4 లక్షలు

4 ఆకుల మొక్క..4 లక్షలు

నర్సరీలో ఓ మొక్క కొనాలంటే ఎంత ధర ఉంటుంది.. 100 రూపాయలు.. 200 రూపాయలు.. పోనీ అరుదైన జాతి అనుకుంటే ఓ వెయ్యి రూపాయలు ఉండొచ్చేమో.. కానీ న్యూజిలాండ్‌లో నాలుగు ఆకులు మాత్రమే ఉన్న ఈ మొక్కను ఓ అజ్ఞాత వ్యక్తి రూ. 4 లక్షలకు కొనుగోలు చేశాడు. ఫిలోడెండ్రాన్‌ మినిమా జాతికి చెందిన ఈ మొక్కను ఇటీవల ‘ట్రేడ్‌ మీ’ అనే ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ వేలానికి పెట్టింది. కొనడానికి ఇద్దరు ఆసాములు తీవ్రంగా పోటీపడ్డారు.  చివరకు ఓ వ్యక్తి నాలుగు లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. తర్వాత అతడు ఆ మొక్క ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘ఈ మొక్కలోని నాలుగు ఆకులు అద్భుతమైన పసుపు, ఆకుపచ్చ రంగులలో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది చాలా అరుదు. అందుకే  కొన్నాను’ అని అతడు రేడియో న్యూజిలాండ్‌తో మాట్లాడుతూ చెప్పాడు.


logo