శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Oct 04, 2020 , 00:32:14

మగ పాముతో కలవకుండానే పిల్లలను కన్న కొండచిలువ!

మగ పాముతో కలవకుండానే పిల్లలను కన్న కొండచిలువ!

అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌ జూలో ఉన్న 62 ఏండ్ల కొండచిలువ ఏడు గుడ్లు పెట్టి పిల్లలను కన్నది. అది కూడా ఏ మగపాముతో కలయిక జరగకుండానే. సాధారణంగా కొండచిలువలు 60 ఏండ్ల వయస్సు వచ్చేసరికి గుడ్లుపెట్టవు. అందునా ఈ కొండచిలువ 20 ఏండ్లుగా సంతానోత్పత్తి ప్రక్రియలో పాల్గొనలేదు. దీని దగ్గరికి ఏ మగపామూ రాలేదు. ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇలా జరగడం అత్యంత అరుదని జూ మేనేజర్‌ మార్క్‌ వానర్‌ అన్నారు. బహుశా మగ కొండచిలువ వీర్యాన్ని తన శరీరంలో ఒకచోట నిల్వ పెట్టుకొని, ఇన్ని ఏండ్ల తర్వాత మళ్లీ గుడ్లు పెట్టి ఉంటుందని చెప్పారు. ఈ పద్ధతిలో ఎలాంటి కలయిక లేకపోయినా పునరుత్పత్తి జరుగుతుందని, ఈ ప్రక్రియను ఫ్యాకల్టేటివ్‌ పార్థినోజెనిసిస్‌ అంటారని తెలిపారు.

తాజావార్తలు