బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Oct 04, 2020 , 00:32:20

అయ్యో.. గురక ఎంత పనిచేసింది!

అయ్యో.. గురక ఎంత పనిచేసింది!

సూరిబాబుకు 21 ఏండ్లు. ఏపీలోని గోకవరం స్వగ్రామం. బాగా అప్పుల పాలయ్యాడు. ఓ భారీ దొంగతనం చేస్తే లైఫ్‌ సెటిల్‌ అవుద్దని ఆలోచించాడు. ఓ ఇంటిని ఎంపిక చేసుకుని, రోజుల తరబడి రెక్కీ నిర్వహించాడు.  ఓరోజు వేకువ జామున  ఇంట్లో దూరాడు. బీరువా దగ్గరికి వెళ్తుండగా పక్కనే బెడ్‌ మీద పడుకున్న యజమాని కదిలినట్టు అనిపించింది. వెంటనే మంచం కింద దూరాడు. ఆ రూములో ఏసీ చల్లదనానికి అక్కడే నిద్రలోకి జారుకున్నాడు. లేచి చూసేసరికి యజమాని లేడు. డబ్బులు లేవు. రూముకు బయట నుంచి తలుపు వేసి ఉంది. తాను మంచం కింద ఉన్న విషయం ఎట్లా తెలిసిందబ్బా.. అని ఆలోచించాడు. అసలు సంగతి ఏంటంటే సూరిబాబు గాఢనిద్రలోకి జారుకొన్నాక గురక ప్రారంభించాడు. ఆ శబ్దానికి యజమానికి నిద్రాభంగమైంది. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశాడు. 


logo