శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Oct 03, 2020 , 00:22:00

ఆపదలో అండగా..

ఆపదలో అండగా..

ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లింది మొదలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఊహించని ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు సదా సిద్ధంగా ఉండాలి. అందుకు సాంకేతిక సాయం తప్పనిసరి. ఆడపిల్లకు రక్షణ కవచంగా బోలెడన్ని మొబైల్‌ అప్లికేషన్లు, డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో దుర్మార్గుల వలలో చిక్కకుండా ధైర్యంగా ముందడుగు వేయొచ్చు.

1 లెట్స్‌ట్రాక్‌

ఇది జీపీఎస్‌ ట్రాకింగ్‌, వెహికిల్‌ సెక్యూరిటీ సిస్టమ్‌. ఈ చిన్న డివైజ్‌ మీ దగ్గర ఉంటే.. ఎప్పటికప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నది ట్రాక్‌ అవుతుంది. అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు ముందుగానే నిర్దేశించిన వ్యక్తులకు అలెర్ట్‌ సందేశం వెళ్లిపోతుంది.

2 మై సేఫ్టీ పిన్‌

ఈ మొబైల్‌ అప్లికేషన్‌ మీకు ఎల్లప్పుడూ ఉండగా ఉంటుంది. మీరు వెళ్లే దారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. సరైన మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఎవరైనా మీ దారిని అడ్డగించినా, దారి తప్పించినా ఆ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అలెర్ట్‌ మెసేజ్‌ రూపంలో పంపిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నది జీపీఎస్‌ లొకేషన్‌ ద్వారా చేరవేస్తుంది.


logo