శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Sep 30, 2020 , 00:35:07

వీధిలోనే విజ్ఞాన కేంద్రం

వీధిలోనే విజ్ఞాన కేంద్రం

అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన గురంగ్‌ మీనా, ఆ రాష్ట్రంలోనే మొట్టమొదటి రోడ్‌సైడ్‌ లైబ్రరీని ఏర్పాటు చేసింది. తన సొంత ఖర్చులతో ఎన్నో అపురూపమైన పుస్తకాలను ఒకచోట చేర్చి, ఉచితంగా విజ్ఞానాన్ని పంచుతున్నది. దేశంలోని దాదాపు ప్రతి ఊరిలోనూ ఒక మద్యం దుకాణం ఉన్నదనీ, కానీ ఆయా గ్రామాల్లో ఎక్కడా గ్రంథాలయాలు మాత్రం కనిపించడంలేదనీ మీనా ఆవేదన వ్యక్తం చేస్తున్నది. అపారమైన జ్ఞానాన్ని సొంతం చేసుకోవాలన్నా, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలన్నా ఉత్తమ గ్రంథాలను చదవాల్సిందేనని మీనా చెబుతున్నది. ‘డబ్బున్న పిల్లలకు ఏదికావాలన్నా ఇట్టే దొరుకుతుంది. కానీ, నిరుపేదలు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. అందుకోసమే ఈ లైబ్రరీని ఏర్పాటు చేశా’ అని చెబుతున్నది. అంతేకాదు, ఈ లైబ్రరీలో 15 నుంచి 20 నిమిషాలపాటు పుస్తకాలు చదివే పిల్లలకు చాక్లెట్లు పంచుతున్నది. ఆవిధంగా, చిన్నారులు పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తున్నది. logo