శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Sep 29, 2020 , 00:13:57

నయా ట్రెండ్‌తో రెస్టారెంట్లు

నయా ట్రెండ్‌తో రెస్టారెంట్లు

కరోనా వైరస్‌ మూలంగా భోజనప్రియులు లేక రెస్టారెంట్లన్నీ వెలవెలబోయాయి. లాక్‌డౌన్‌ తొలగినా అంతంత మాత్రంగానే జనాలు బయటి ఫుడ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఎక్కువ శాతం మంది పార్సిల్‌ చేసుకొని ఇంటి వద్దనే తింటున్నారు. హోటల్‌లో భోజనం చేయడానికి అంతగా ఇష్టపడడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్న రెస్టారెంట్ల యజమానులు కొత్త ట్రిక్‌ను ఉపయోగించుకొని గండం నుంచి గట్టెక్కాలని సూచిస్తున్నారు న్యూయార్క్‌లోని బిస్ట్రో అనే రెస్టారెంట్‌ ప్రతినిధులు.  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా బబుల్స్‌ను వాడుతుంది. మాస్కులు లేకుండా ఉండడంతోపాటు కస్టమర్లు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి ఈ బబుల్స్‌ బాగా ఉపయోగపడుతున్నాయి. బబుల్‌ లోపల కూర్చొని తినడం అనేది ఓ కొత్త అనుభూతినిస్తుందని చెబుతున్నారు. ఈ బబుల్స్‌ను ఔట్‌ డోర్‌ హోటల్స్‌గా ఉపయోగించుకోవడంతో చలి, వర్షం, మంచు నుంచి కూడా కాపాడుతున్నాయి.  దీని వల్ల రెస్టారెంట్‌ బయటే స్వేచ్ఛగా కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేయవచ్చు.  ఈ కొత్త ట్రెండ్‌కు జనం కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో వేలకొద్దీ రెస్టారెంట్లు ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాయి. త్వరలో మన ముందుకూ వచ్చే అవకాశం ఉంది.


logo