ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Sep 28, 2020 , 00:21:50

వార్తల్లో మహిళ... ఈషా కుట్టి

వార్తల్లో మహిళ... ఈషా కుట్టి

ఢిల్లీకి చెందిన హూప్‌ డ్యాన్సర్‌ ఈషా కుట్టి పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. చీరకట్టుతో ఈ రింగ్‌ డ్యాన్సర్‌ చేసిన నాట్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రెండు రింగులతో ఆమె చేసిన జిమ్నాస్టిక్‌ విన్యాసాలు ఔరా అనిపించాయి. జిమ్నాస్టిక్‌ దుస్తుల్లో ఇలాంటివి చేయడం ఆమెకు మామూలే. ఒళ్లును విల్లులా వంచి రకరకాల భంగిమలు ప్రదర్శించడం ఈషాకు చిటికెలో పని. ఇప్పుడు చీర ధరించి తన ప్రయత్నాన్ని కొనసాగించింది. ‘జెండా ఫూల్‌' పాటకు మెరుపు వేగంతో నృత్యం చేస్తూనే.. రింగులను తన మేనిపై గింగిరాలు తిప్పేసింది. హూప్‌ డ్యాన్స్‌తో మంత్రముగ్ధులను చేసింది. చీరను మించిన వస్త్రశ్రేణి మరొకటి లేదని అందరూ అంగీకరిస్తారు. కానీ, ఉరుకుల పరుగుల జీవితంలో చీరకట్టుతో చిక్కులు ఎదురవుతాయని చాలామంది అనుకుంటారు. ఆ అభిప్రాయం తప్పని చాటడానికే తానీ ప్రయత్నం చేశానంటున్నది ఈషా కుట్టి.logo