బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Sep 25, 2020 , 00:25:19

నియంత్రణ మీ చేతుల్లోనే!

నియంత్రణ మీ చేతుల్లోనే!

పుస్తకాలతో కన్నా పిల్లలకు స్మార్ట్‌ఫోన్లతోనే దోస్తీ ఎక్కువైంది. ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా తల్లిదండ్రులూ అడ్డుచెప్పలేకపోతున్నారు. చదువునే సాకుగా చూపి తరగతులు అయిపోయిన తర్వాత కూడా అదే పనిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందే కూర్చుంటున్నారు చాలామంది చిన్నారులు. ఇదిఇలాగే కొనసాగితే స్క్రీన్‌టైమ్‌ పెరిగి పిల్లల కండ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. చదువు మాట అటుంచితే, ఆటపాటల్లో తేలిపోయే అవకాశమూ ఉంది. వారిని ఓ కంట కనిపెడుతూ స్క్రీన్‌టైమ్‌ను నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని గుర్తుంచుకోండి.

  • క్లాసులున్నప్పుడు ఫోన్‌, ల్యాపీ చూడొద్దని ఎలాగూ చెప్పలేం. అయినా గంటల తరబడి స్క్రీన్‌వైపు చూస్తూ ఉంటే కండ్లు అలసిపోతాయి. తలనొప్పి వస్తుంది. నలభై నిమిషాలకు ఒకసారి తరగతి విరామంలో ఐదారు నిమిషాలు ఫోన్‌కు విరామం ఇచ్చేలా చూడండి.
  • క్లాస్‌ పూర్తవగానే వెంటనే ప్రాజెక్ట్‌ వర్క్‌ అని, హోమ్‌ వర్క్‌ అని అలాగే ఫోన్‌ పట్టుకుంటే అడ్డుచెప్పండి. కనీసం గంట తర్వాత ఫోన్‌ ఇవ్వండి.
  • క్లాసులు అయిపోయిన తర్వాత టీవీ ముందు సెటిల్‌ అయిపోతుంటారు. బడి నుంచి వచ్చినప్పుడు ఆటవిడుపుగా కాసేపు టీవీ చూడటంలో తప్పు లేదు. కానీ, పొద్దంతా తెరవైపు చూస్తూ సాయంత్రాలు టీవీ ముందు కూర్చుంటే ఇబ్బందే! టీవీ సమయాన్ని తగ్గించండి. పైగా ఐపీఎల్‌ సీజన్‌ మొదలైంది. గంటల కొద్దీ టీవీకి అతుక్కుపోకుండా నియంత్రించాల్సిందే!
  • పిల్లలు కాస్త పెద్దవాళ్లయితే ఓ కంట కనిపెట్టాల్సిందే. క్లాసులు వింటూనే వాట్సాప్‌ చాట్‌లు, గేమ్స్‌, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇతర వెబ్‌సైట్లకు యాక్సెస్‌ ఇవ్వకండి.
  • స్మార్ట్‌ఫోన్‌ పక్కన పెట్టి ఇతర వ్యాపకాల్లో బిజీగా ఉండేలా చూడండి. పుస్తకాలు చదవమనండి. ఇండోర్‌ గేమ్స్‌కు అనుమతి ఇవ్వండి. పెయింటింగ్‌, సంగీతం, నృత్యం వంటి కళలను పరిచయం చేయండి.


logo