శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Sep 23, 2020 , 00:49:51

వర్ష ప్రియదర్శిని

వర్ష ప్రియదర్శిని

ప్రతిభ ఉంటే చాలు... దాన్ని నిరూపించుకోవడానికి వేదికలు అవసరం లేదు. అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు. ఓ మొబైల్‌ ఫోన్‌ ముందు పెట్టుకుని, విశ్వరూపం చూపించేయడమే. అది పదిమంది కళ్లలో పడి తీరుతుంది. వారిలో ఎవరి మనసన్నా కదిలితే, అనూహ్యమైన బ్రేక్‌ లభిస్తుంది. అదే జరిగింది ‘నమిత మెలేక’ విషయంలో. ఒడిషాకు చెందిన ఈ పదిహేనేళ్ల గిరిజన బాలిక ఆమధ్య సరదాగా ‘మాహీ తేరీ చునరియా’ అంటూ ఓ హిందీ పాట అందుకుంది. అది కాస్తా వైరల్‌ కావడంతో  ప్రముఖ నటి వర్ష ప్రియదర్శని... నమిత కోసం ఏదైనా చేయాలనుకుంది. ఓ మ్యూజిక్‌ డైరక్టర్‌తో మాట్లాడి  ప్రైవేటు ఆల్బమ్‌లో పాడే అవకాశం ఇప్పించింది. అంతేకాదు... నమిత చదువు పూర్తయిన తర్వాత, సంగీతంలో ఆమెకంటూ ఓ కెరీర్‌ నిర్మించే బాధ్యత తనదేనని భరోసా ఇస్తున్నది.