శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Sep 22, 2020 , 01:16:24

అలల మీదుగా ఆకాశంలోకి..

అలల మీదుగా ఆకాశంలోకి..

నేటితరం యువతులు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ తమదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు పురుషులు మాత్రమే చేయగలిగిన ఉద్యోగాల్లోనూ, ఇప్పుడు అతివలు సత్తాచాటుతున్నారు. 

భారత నావికాదళానికి చెందిన సబ్‌ లెఫ్టినెంట్‌ రితీ సింగ్‌, సబ్‌ లెఫ్టినెంట్‌ కుముదినీ త్యాగీ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. యుద్ధనౌకల పైనుంచే హెలీకాప్టర్ల ద్వారా సముద్రంలో గస్తీకాయనున్నారు. ఇప్పటిదాకా పురుష పైలెట్లు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతలో, ప్రస్తుతం వీరిద్దరూ పాలుపంచుకోనున్నారు. 2018లో నేవీలో చేరిన రితీ సింగ్‌, కుముదిని, కొచ్చిలోని దక్షిణ నేవీ కమాండ్‌ సెంటర్‌ నుంచి నేవీ అబ్జర్వర్‌ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. వీరిలో రితీసింగ్‌ హైదరాబాద్‌కు చెందినవారు. ఆమె కుటుంబంలోని మూడు తరాలు సైన్యంలో పని చేశారు.  తాత ఆర్మీలో, తండ్రి నేవీలో విధులు నిర్వర్తించారు. “తెల్లని యూనిఫాం ధరించి, నేవీలో సేవలందించాన్నదే నా కల. చిన్ననాటి నుంచీ అదే లక్ష్యం కోసం కృషి చేశా. ఇప్పుడు దాన్ని సాధించా” అని రితీ సింగ్‌ చెబుతున్నారు. ఇక కుముదినీ త్యాగీ ఘజియాబాద్‌కు చెందినవారు. 


logo