మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Sep 21, 2020 , 00:13:04

ఒత్తిడిని తరిమేయండి

ఒత్తిడిని తరిమేయండి

‘కొవిడ్‌-19’ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులు తమ ఇంటి నుంచే పని చేసుకోవడం బాగానే ఉన్నా, చాలామంది ఒత్తిడికి గురవుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఒకేచోట కదలకుండా కూర్చొని పనిచేయడం వల్ల శారీరక ఇబ్బందులు కూడా పడాల్సి వస్తున్నది. ఈ సమస్యల పరిష్కారం కోసం కొన్ని చిన్నచిన్న చిట్కాలు, వ్యాయామాలు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

యోగా

శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతతను 

చేకూర్చడంలో యోగాను మించింది లేదు. అందుకోసమే పనిని పక్కన పెట్టి, కాసేపు యోగా చేయండి. మీ కంప్యూటర్‌/ల్యాప్‌ ముందే కూర్చొని, ఓ 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే చిన్న చిన్న యోగాసనాలు వేయండి. కొత్త ఉత్సాహంతో మళ్లీ మీ పనులను మొదలుపెట్టండి.

పుషప్స్‌

పుషప్స్‌ అనేది సాధారణ వ్యాయామం. కానీ, శరీరంపై మంచి ప్రభావం చూపుతుంది. ఒకే దగ్గర కూర్చొని పనిచేసే సమయంలో కాళ్లు, చేతులు పట్టేసినట్లు అనిపిస్తాయి. ఆ సమయంలో 10 నుంచి 15 పుషప్స్‌ తీస్తే చాలు. చేతులు, భుజాలు, కాళ్ల నొప్పులు ఇట్టే పోతాయి. నడుము కూడా బలంగా తయారవుతుంది. 

స్కాట్స్‌

‘కింగ్‌ ఆఫ్‌ ఎక్సర్‌సైజ్‌'గా పిలిచే ‘స్కాట్స్‌' చేయడం వల్ల కూడా ఒత్తిడిని దూరం చేయొచ్చు. అమ్మాయిలు చేసే వ్యాయామాల్లో ఇదే అత్యుత్తమమైంది. ఏరోబిక్స్‌కి ఏమాత్రం తీసిపోని ‘స్కాట్స్‌' చేయడం వల్ల శరీరంలో హార్మోన్‌ లెవెల్స్‌ పెరుగుతాయి. ఫలితంగా మానసిక ఒత్తిడి నుంచి తగిన ఉపశమనం లభిస్తుంది. logo