శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Sep 21, 2020 , 00:12:44

టచ్‌ మీ నాట్‌ గప్‌చుప్‌

టచ్‌ మీ నాట్‌ గప్‌చుప్‌

కొవిడ్‌ కారణంగా గప్‌చుప్‌ బండ్లు కనిపించడమే గగనం అయిపోయింది. ఒకటీ అరా కనిపించినా, తినాలని మనసు లాగినా.. వైరస్‌ భయంతో కోరికను లోలోపలే అణచుకుంటున్న వాళ్లు ఎందరో. చకచకా చేతులాడిస్తూ ఇచ్చే గప్‌చుప్‌తో వైరస్‌ వస్తుందని అందరిలోనూ ఓ భయం! ఈ సమస్యకు చెక్‌పెడుతూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో గప్‌చుప్‌ వెండింగ్‌ యంత్రంతో వ్యాపారాన్ని పునఃప్రారంభించాడో వ్యక్తి. గోల్‌గప్పాల్లో రసం మెషిన్‌తో నింపి ఇస్తున్నాడు. దీంతో గప్‌చుప్‌ ప్రియులు ఆయన బండి దగ్గర క్యూ కడుతున్నారు. ఆటోమేటిక్‌ పానీపూరి సిత్రాన్ని చూసిన ఐఏఎస్‌ అధికారి అవినాశ్‌ శరణ్‌ ఆ ముచ్చటను ఫొటో తీసి ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ‘టచ్‌ మీ నాట్‌ పానీపూరీ’ అని నామకరణం చేశాడు. ఇంకేముంది రాయ్‌పూర్‌ గప్‌చుప్‌వాలా సృజనాత్మకత వైరల్‌ అయింది. ‘మా దగ్గరా ఇలాంటి యంత్రాలతో గప్‌చుప్‌ల అమ్మకాలు మొదలైతే బాగుంటుంది కదా!’ అనే ఆశ అందరిలోనూ మొదలైంది.