గురువారం 29 అక్టోబర్ 2020
Zindagi - Sep 19, 2020 , 22:59:37

కరణం మల్లీశ్వరి

కరణం మల్లీశ్వరి

ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి.. మరోసారి వార్తల్లో నిలిచారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో సెప్టెంబర్‌ 19న వెయిట్‌ లిఫ్టింగ్‌లో మల్లీశ్వరి కాంస్య పతకం గెలుపొందారు. ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమై 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా, సుప్రసిద్ధ ‘ఒలింపిక్‌ చానల్‌' ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా పలువురు  క్రీడాకారిణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఆనాడు మల్లీశ్వరి గెలిచింది కాంస్య పతకమే అయినా, అది దేశంలోని ఎందరో క్రీడాకారిణుల్లో స్ఫూర్తి నింపింది. అంతకుముందు కూడా పీటీ ఉష, షైనీ విల్సన్‌, కుంజరాణీ దేవిలాంటి ఎంతో మంది అథ్లెట్లు ప్రపంచ క్రీడా యవనికపై అద్భుతాలు సృష్టించినప్పటికీ, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ మాత్రం సరికొత్త చరిత్రకు నాంది పలికాయి’ అని చెప్పారు. ప్రస్తుతం మల్లీశ్వరి హరియాణాలోని యమునానగర్‌లో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. logo