బుధవారం 30 సెప్టెంబర్ 2020
Zindagi - Sep 16, 2020 , 00:11:45

జలదృశ్యంలో ఘనసన్మానం

జలదృశ్యంలో ఘనసన్మానం

స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగువర్గాల నాయకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఒక పట్టాన ఎవరినీ ప్రశంసించరని ఆయన సమకాలీన రాజకీయ నేతలు అంటుండేవారు. స్వపక్షమైనా, విపక్షమైనా తప్పు చేస్తే నిక్కచ్చిగా మాట్లాడే తత్త్వం ఆయనది. అలాంటి ఆయన మెప్పు పొందిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కింది. అదీగాక పీవీని స్వయంగా ఆహ్వానించి జలదృశ్యంలో ఘనంగా సన్మానించడం మరో విశేషం. అందుకు కారణం లేకపోలేదు. అప్పటికే బీసీలపై అధ్యయనం కోసం అనంతరామన్‌ కమిషన్‌ ఇచ్చిన సిఫారసులను యథాతథంగా పీవీ అమలు చేశారు. సొంత పార్టీలోని నేతల విమర్శలను కూడా లెక్కచేయకుండా 1971 ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సంఖ్యలో సీట్లను కేటాయించారు. ఆ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఈ సందర్భంగానే కొండా లక్ష్మణ్‌ పీవీని ప్రత్యేకంగా సన్మానించారు. అటు తరువాత కాలంలో అనంతరామన్‌ సిఫారసులను అమలు చేసిన ఒక్క ముఖ్యమంత్రి కూడా లేకపోవడం గమనార్హం.logo