బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Sep 10, 2020 , 00:04:24

సురేఖా సిక్రీ

సురేఖా సిక్రీ

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌లో బామ్మగా తెలుగువారందరికీ గుర్తుండిపోయిన సీనియర్‌ నటి సురేఖా సిక్రీ అస్వస్థతకు గురయ్యారు. 75 ఏండ్ల సురేఖ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మంగళవారం ముంబయిలోని ఓ దవాఖానలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించలేకపోతున్నామని సురేఖ సంరక్షకురాలు పేర్కొన్నారు. అయితే విషమంగానే ఉన్నా.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు. ‘బాలికా వధు’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సురేఖ పలు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించారు. 2018లో ‘బదాయీ హో’ చిత్రంలో నటనకు గాను ఉత్తమ సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌గా జాతీయ పురస్కారం సైతం అందుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఘోస్ట్‌ స్టోరీస్‌' చిత్రంలోనూ తన నటనతో మెప్పించారామె.logo