శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Sep 09, 2020 , 04:04:03

ఎర్రగానే ఎందుకు?

ఎర్రగానే ఎందుకు?

ఉదయం నుంచి సాయంసంధ్య వేళ వరకు సూర్యుడు బంగారు వర్ణంలో మెరిసిపోతాడు. కానీ సాయంత్రం పూట మాత్రం ఎర్రగా ఉన్న సూర్యుడు కొండల్లోకి దిగిపోతున్నట్లు కనిపిస్తాడు. ఆ దృశ్యాన్ని ఇష్టపడని వారు ఉండరేమో కదా! మరి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు? అంటే.. సాయంత్ర వేళ సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతుంటాయి. దానివల్ల అవి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అలా ప్రయాణించేటప్పుడు సూర్యకిరణాలలో ఎరుపురంగు తప్ప మిగిలిన అన్ని వర్ణాలూ ధూళి కణాల వల్ల చెల్లాచెదురయిపోతాయి. కాంతిలో ఉండే మిగతా వర్ణాల కంటే ఎరుపు రంగుకు తరంగ ధైర్ఘ్యం ఎక్కువ. దాంతో ఎక్కువ తరంగధైర్ఘ్యం ఉన్న ఎరుపు రంగు మాత్రమే మిగులుతుంది. అందువల్ల అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడన్నమాట.