బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Sep 09, 2020 , 00:05:25

వంటింటి రాణులు

వంటింటి రాణులు

ఢిల్లీలో ఉంటారు గరిమా బక్షి, సుకృతి చోప్రా. ఇద్దరి వయసు 27 ఏండ్లే. ఇద్దరూ మంచి స్నేహితులు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో సోషల్‌మీడియాతో పాటు వంటింట్లోనూ బిజీబిజీగా గడిపారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. ఏ వంటకు ఎలాంటి దినుసులు వాడాలి, ఏ స్థాయిలో ఉపయోగించాలి.. ఇలా చాలా ప్రయోగాలు చేశారు. స్వదేశీ దినుసులతో విదేశీ వంటకాలనూ ప్రయత్నించారు. బాగా కుదిరాయి. తమ ప్రయోగాలను ఇన్‌స్టా వేదికగా పంచుకోవాలని అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. ‘సింగిల్‌ ఆరిజన్‌ కిచెన్‌' హ్యాండిల్‌ మొదలుపెట్టారు. అందులో దేశదేశాలకు చెందిన రెసిపీల తయారీ కబుర్లు పంచుకోవడం మొదలుపెట్టారు. అందమైన చిత్రాలు తీసి పోస్ట్‌ చేయడం ప్రారంభించారు. నెలల వ్యవధిలో వేలమందిని చేరుకున్నారు. రకరకాల రుచులతో ఫాలోవర్స్‌ను అలరిస్తున్నారు. వారు చేసిన, చేస్తున్న వంటకాల కథాకమామీషు అందరితో పంచుకుంటున్నారు. ‘ఫలానా రెసిపీ ఎలా చేయాలంటూ ఫాలోవర్స్‌ అడుగుతుంటే సంబురంగా ఉంద’ని చెబుతున్నారు ఇద్దరూ!


logo