మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Sep 09, 2020 , 00:31:26

నీనా గుప్తా

నీనా గుప్తా

వెండితెరతోపాటు బుల్లితెరపైనా తనదైన ముద్రవేసిన నీనా గుప్తా, సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్‌ అవుతూనే ఉంటారు. తన జీవితానుభవాలు నేర్పిన గుణపాఠాలను, అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ‘మహిళల ఆహారం’పై సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. “ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఎంతగానో ఇష్టపడుతారు. తమకు నచ్చిన పదార్థాలను ఎంతో ప్రేమగా తింటారు. కానీ, మహిళలు మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఉంటారు. వారి ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి.. తన భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులకు ఇష్టమైన ఆహారాన్ని మాత్రమే వండుతారు. దాన్నే తింటారు. కూడా తమకు నచ్చిన ఆహారం విషయంలో ఎప్పుడూ సర్దుకునే పోతుంటారు” అని నీనా పెట్టిన పోస్ట్‌పై, సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ సాగుతున్నది. 


logo