సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Sep 07, 2020 , 00:06:05

వీళ్ల జోడీ అదుర్స్‌

వీళ్ల జోడీ అదుర్స్‌

డబల్‌ రోల్‌ ఓ సక్సెస్‌ఫుల్‌ ఫార్ములా! కవల పిల్లల్లో ఒకరు అమాయకంగా కష్టాలు పడుతూ ఉంటే. మరొకరు ఆ స్థానంలోకి వచ్చేసి దుమ్మురేపడం... వాటిలో కామన్‌ పాయింట్‌. కానీ ఇద్దరూ ఒకేసారి అదిరిపోయే ఎంట్రీ ఇస్తే! ఇదే సూత్రాన్ని అందుకుంటున్నారు ఇప్పటి కవలలు. తమ సారూప్యతను కమర్షియల్‌గా మలచుకుంటున్నారు.

ఇన్‌ఫ్లూయన్సర్స్‌! సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను కూడగట్టుకున్నవాళ్లకి ఇచ్చే బిరుదు. వీళ్ల పోస్టులకి ప్రభావం ఎక్కువ కాబట్టి, తమ ఉత్పత్తుల గురించి ఓ నాలుగు మంచి మాటలు చెప్పమంటూ... కంపెనీలు వీళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఈ ఇన్‌ఫ్లూయన్సర్స్‌కి వచ్చిన మరో జోడింపు ట్విన్‌ఫ్లూయన్సర్స్‌. అంటే కవలలు ఇన్‌ఫ్లూయన్సర్లుగా మారడం. ఇప్పుడు కవలలు సామాజిక మాధ్యమాలలో మంచి ఫాలోయింగ్‌ సంపాదిస్తున్నారు. గత సంవత్సరం అమెరికాలో మొదలైన ఈ ట్రెండ్‌ ఎంత విజయవంతం అయిందంటే... కొంతమంది ట్విన్‌ఫ్లూయర్స్‌ తమ పేరుతో ఓ ప్రత్యేక బ్రాండ్‌ను కూడా మొదలుపెట్టేంత! ఆ బాటలో ఇప్పుడు భారతీయ కవలలు కూడా ట్విన్‌ఫ్లూయర్స్‌గా మారడానికి సిద్ధపడిపోతున్నారు.

మొదటి వీడియోకే కోటి వ్యూస్‌!


ఢిల్లీలో సురభి, సమృద్ధి (చింకి, మింకి) అనే కవలలకి వేర్వేరు సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ఉండేవి. ఓ రోజు సరదాగా ఇద్దరూ కలిసి దిగిన కొన్ని ఫొటోలని వాటిలో పోస్ట్‌ చేశారు. అంతే... లైక్స్‌ పోటెత్తాయి. దాంతో ఇద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ తెరిచి లక్షల మంది ఫాలోవర్లను ఆకట్టుకున్నారు. వాళ్ల మొట్టమొదటి టిక్‌టాక్‌ వీడియో కోటి వ్యూస్‌ కొల్లగొట్టింది. ఇప్పుడా కవలలు లేస్‌, ఇమామీ, మౌంటెన్‌ డ్యూ లాంటి ప్రసిద్ధ బ్రాండ్స్‌ని ప్రచారం చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన మంజిత్‌, మందీప్‌ కూడా ఇదే బాటలో ఫ్యాషన్‌ బ్రాండ్లు దక్కించుకున్నారు. కవల పిల్లలు కాకపోయినా... ఒకేలా ఉండేవాళ్లు కూడా ట్విన్‌ఫ్లూయర్‌గా మారడానికి ప్రయత్నిస్తున్నారు. అసోంకు చెందిన అంతర నేండి, అంకిత నేండి మధ్య మూడేళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ నేండి సిస్టర్స్‌ పేరుతో ట్విన్‌ఫ్లూయర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.

లాభనష్టాలూ కవలలే

కవలలు చాలా అరుదు కాబట్టి, ప్రేక్షకుల్ని త్వరగా ఆకట్టుకుంటారు. సెలబ్రిటీలతో పోలిస్తే వాళ్లకి ఇచ్చే పారితోషికం చాలా తక్కువ. పైగా ఒకే బ్రాండ్‌లో ఉండే రెండు ఉత్పత్తులను ఒకేసారి స్క్రీన్‌ మీద చూపించవచ్చు. 1+1 లాంటి ఆఫర్లను ప్రభావవంతంగా ప్రదర్శించవచ్చు. logo