మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Sep 07, 2020 , 00:05:05

ఆడవాళ్లదే అన్నం!

ఆడవాళ్లదే అన్నం!

‘కరోనా’తో ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. కార్పొరేట్‌ ఉద్యోగులు మొదలు, రోజు కూలీ దాకా ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా అనేక మందికి పట్టెడన్నం కూడా కరువైంది. ఈ క్రమంలో ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌' నిర్వహించిన ఓ సర్వే అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

అమెరికాకు చెందిన ‘కేర్‌ స్వచ్చంద సంస్థ’తో కలిసి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగామ్‌' సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా అనేక దేశాల్లో వ్యవసాయ పనులతోపాటు ఆహార కొరతను తీర్చడంలో మహిళలే కీలకంగా వ్యవహరిస్తున్నారని కేర్‌ సంస్థ ప్రతినిధి డాక్టర్‌ మౌరీన్‌ మిరుక తెలిపారు. పురుషుల్లో చాలా మంది పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడటం లేదనీ, కూలీతోపాటు చిన్నచిన్న పనులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మగవాళ్లు వేరే ప్రాంతాలకు వలస వెళ్తుండటం వల్ల వ్యవసాయ పనులన్నీ మహిళలే చేయాల్సి వస్తున్నదని చెబుతున్నారు. కరోనాకు ముందు కూడా వ్యవసాయంలో నాట్లు వేయడం మొదలు, కలుపు తీయడం, పంట కోయడం, వడ్లను తూర్పారబట్టడంలాంటి అనేక పనుల్లో ఆడవాళ్ల పాత్రే అధికంగా ఉండేదనీ, కరోనా తర్వాత అది మరింత కీలకంగా మారిందని ఆమె అంటున్నారు. logo