శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Sep 06, 2020 , 00:17:55

బాహుబలి రాకెట్‌ బూస్టర్‌!

బాహుబలి రాకెట్‌ బూస్టర్‌!

అమెరికా 2024లో మళ్లీ చంద్రుడి మీదికి మనుషులను పంపనున్నది. ఇందుకోసం నాసా ఓ భారీ రాకెట్‌ను సిద్ధం చేస్తున్నది. ఇది 1960లో తయారు చేసిన సాటర్న్‌ 5 రాకెట్‌ తర్వాత అతి పెద్దది. దీనికి నాసా స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌) అని పేరు పెట్టింది. ఈ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడం కోసం బుధవారం భారీ బూస్టర్‌ను పరీక్షించింది. ప్రపంచంలో ఇప్పటివరకు తయారు చేసిన రాకెట్‌ బూస్టర్లన్నిం టిలోకెల్లా ఇదే అతిపెద్దది. అత్యంత శక్తివంతమైనది. ఇది సెక నుకు దాదాపు 6 టన్నుల ఇంధనాన్ని మండిస్తుంది. నాలుగు ఇంజన్లు గల జంబో జెట్‌ విమానాలు 14 కలిపి ఉత్పత్తి చేసే పీడనం కన్నా ఎక్కువ పీడనాన్ని పుట్టిస్తుంది. దీనిపొడవు 54 మీటర్లు. వెడల్పు 4 మీటర్లు. బూస్టర్‌ను యూటా రాష్ట్రం లోని ప్రోమాన్టోరీలో పరీక్షించారు. ఇది రెండు నిముషాల పాటు అగ్ని కీలలను వెదజల్లింది. ఎస్‌ఎల్‌ఎస్‌ రాకె ట్‌లో ఇలాంటి బూ స్టర్లను రెండింటిని ఉపయో గిస్తారు. రాకెట్‌ ప్రయోగిం చినప్పుడు అది అంత రిక్షంలోకి ప్రయాణిం చడానికి అవసరమైన పీడనాన్ని ఈ బూస్టర్ల్లు అందజేస్తాయి.