గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Sep 06, 2020 , 00:17:55

ఆ ఉల్క ఓ బంగారు ముద్ద!

ఆ ఉల్క ఓ బంగారు ముద్ద!

అంగారకుడు, గురు గ్రహాల మధ్య ఉల్కా వలయం. అందులోని లక్షలాది ఉల్కల్లో 16 సైకీ ఒకటి. దీనిపై నాసా అధ్యయనం నిర్వహించాలని తలపెట్టింది. 2022లో ఈ మిషన్‌ను ప్రారంభించనున్నది. ఆ ఒక్క ఉల్కపైనే అధ్యయనం ఎందుకు అని ఆలోచిస్తున్నారా.. ఈ ఉల్కలో అత్యంత విలువైన ఖనిజాలు ఉన్నాయి. దీని లోపల ఖనిజాలను గనుక దొరికితే భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావచ్చు. అక్కడ 17 మిలియన్‌ బిలియన్‌ టన్నుల నికెల్‌-ఇనుము నిక్షేపాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  ప్రస్తుత మనిషి అవసరాలను బట్టి చూస్తే కొన్ని మిలియన్‌ సంవత్సరాల వరకు ఈ నిక్షేపాలు తరిగిపోవు. ఈ నేపథ్యంలో నాసా ఈ ఉల్కపై అధ్యయనం నిర్వహించాలని భావిస్తున్నది. అరిజోన వర్సిటీ నేతృత్వంలో ఈ మిషన్‌ను నిర్వహించనున్నారు. ఇనుము, మంచు, మట్టి లేని ఓ అంతరిక్ష పదార్థంపై నాసా ప్రయోగాలు నిర్వహించనుండటం ఇదే తొలిసారి. నాసా అంతరిక్ష నౌక 2026లో 16 సైకీ దగ్గరకు చేరుకొని 21నెలల పాటు దానిపై అధ్యయనం జరుపుతుంది. 


logo