మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Sep 03, 2020 , 23:58:48

ఈ సెన్సర్‌.. చెమటను చదివేస్తుంది!

ఈ సెన్సర్‌..  చెమటను చదివేస్తుంది!

నానోసెల్యూలోస్‌, ప్యూర్‌ పాలిమర్‌తో ఒక సెన్సర్‌ని రూపొందించారు బ్రెజిల్‌ పరిశోధకులు. ఈ సెన్సర్‌ ద్వారా చెమట నుంచి మనలో జరిగే జీవక్రియను గుర్తిస్తారు. ఇప్పటివరకు వచ్చిన అనేక సెన్సర్లను గమనిస్తే.. చర్మ రంధ్రాలు, చర్మం సెన్సర్ల మధ్య చెమట ఒక అవరోధంగా ఉండేది. కానీ ఇది అలా కాదు.. చెమట ద్వారానే గుర్తించేలా ఈ సెన్సర్‌ రూపకల్పన జరిగింది. మామూలుగా అయితే ఏదైనా అలెర్జీ, ప్రతిచర్యలను గుర్తించడానికి చెమట ఆటంకం కలిగిస్తుంది. ఇది అలా కాకుండా.. ఇందులో ఉండే నానోసెల్యూలోస్‌ ఆ చెమటను తీసేసుకుంటుంది. ఎలక్ట్రోడ్‌ సజీవ పొరలోకి చెమట వెళ్లిపోతుంది. కార్బన్‌ దాని ముఖ్యమైన విద్యుత్‌ వాహకంగా పనిచేస్తుంది. పరిశోధనను అభివృద్ధి చేసి ఈ వ్యవస్థ ద్వారా జీవక్రియను గమనించి ఔషధాలను తయారు చేస్తామని చెబుతున్నారు అక్కడి పరిశోధకులు. చెమటలో లోహ అయాన్లు, బయోమార్కర్లను గుర్తించడానికి ఎలక్ట్రో కెమికల్‌ సెన్సర్లలో ఉపయోగించే నానోసెల్యూలోస్‌తో దీన్ని రూపొందించారు. ఈ నానోసెల్యూలోస్‌ వందశాతం స్వచ్ఛమైన పాలిమర్‌. సెన్సర్‌లకు వాడే మామూలు ప్లాస్టిక్‌ ఏదైనా చర్మరంధ్రాలు, చర్మానికి పనిచేయవు. కానీ వీరు తయారు చేసిన ప్లాస్టిక్‌ మాత్రం చర్మానికి ఎటువంటి హానీ కలిగించకుండా ఉంటుంది. పైగా కొన్ని సంవత్సరాలుగా.. వాణిజ్యపరంగా కూడా గాయాలు అయినప్పుడు డ్రెస్సింగ్‌లో వాడే ఎలక్ట్రో కెమికల్స్‌నే ఈ సెన్సర్‌ తయారీ కోసం వాడారు. ఈ సెన్సార్‌.. 1.5 సెంటీమీటర్ల పరిమాణంలో 0.5 సెం.మీల వెడల్పుతో ఉంటుంది. ఈ కణజాల కాగితంషీట్‌లా సన్నగా ఉంటుంది. ఇది సోడియం, పొటాషియం, యూరిక్‌ యాసిడ్‌, లాక్టిక్‌ ఆమ్లం, గ్లూకోజ్‌ వంటి అనేక రకాల బయోమార్కర్లను కూడా గుర్తిస్తుంది. ఇవి రక్తంలో, చెమట ద్వారా గుర్తించబడుతాయి. ఈ నానోసెల్యూలోస్‌ సెన్సార్‌ ద్వారా డయాబెటిస్‌ని మానిటరింగ్‌ చేయొచ్చు. అంతేకాదు.. మహిళల్లో స్ట్రాడియోల్‌ అనే హార్మోన్‌ను గుర్తించి. జీవులలో వాతావరణ కాలుష్యం, ఉనికిని పరీక్షించడానికి ఈ సెన్సర్‌ వ్యవస్థను ఉపయోగించవచ్చు. ఈ సెన్సర్‌ ఒక పొటెన్షియోస్టాట్‌తో అనుసంధానించి ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్‌ వర్తమానాన్ని మనం అనుసంధానించిన కంప్యూటర్‌కి పంపుతుంది. 


logo