గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Sep 01, 2020 , 22:52:43

ఎడారిలో నీరు

ఎడారిలో నీరు

అనగనగా దేవగిరి అనే రాజ్యంలో చక్రాచార్య అనే రాజు ఉండేవాడు. అతనికి దూర ప్రయాణాలు చేయడం అంటే  చాలా ఇష్టం. అడవులు, పర్వతాలు, సెలయేర్లను దాడటం అంటే  సరదా. ఒక రోజు తన బంట్లను తీసుకొని ఓ ఎడారి ప్రాంతానికి  బయలుదేరాడు. ఆ ఎడారి గుండా అవతలి దేశానికి వెళ్లాలనే కోరిక కలిగింది. ఒంటెలతో ఎడారి ప్రయాణాన్ని ప్రారంభించాడు.  కొద్ది దూరం తర్వాత  ఆ జంతువులు   వేడిని తట్టుకోలేక పోయాయి. దీంతో రాజు, బంట్లు కాలినడకను ప్రారంభించారు. కూడా తెచ్చుకున్న ఆహార పదార్థలను సేవిస్తూ ముప్పై మైళ్ల ప్రయాణం చేశారు. తర్వాత వారి దగ్గర తాగడానికి నీరు కూడా  మిగలలేదు. వారిలో కొందరి కాళ్లకు బొబ్బల్లు వచ్చాయి. అయినా ముందుకు సాగారు.  

నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించడం కష్టమని అనుకున్నారు. కొందరు బంట్లు వారి దాహార్తి గురించి రాజుకున్న విన్నవించుకున్నారు. అపుడు రాజు ‘నేనూ అధైర్యపడితే వీళ్లు మరీ నీరుగారిపోతారు. ఈ పరిస్థితుల్లో వీరిని వదిలేయడం నాయకత్వమనిపించుకోదు. ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఇంత శ్రమా వృథా అయిపోయినట్టే’  అనుకున్నాడు. కనుచూపుమేరలో గడ్డి పరకలు కనిపించాయి. ‘నీరు లేకుండా గడ్డి ఎడారిలో పెరగదుగదా’ అనుకున్నాడు. వెంటనే తన అనుచరుల్లో చలాకీగా వున్న వారిని పిలిచి అక్కడ గొయ్యి తవ్వమన్నాడు. తవ్వగా తవ్వగా వాళ్లకి రాయి అడ్డు వచ్చింది. విసుగెత్తి రాజును తిట్టుకున్నారు. ‘ఇదంతా వృథాశ్రమ, సమయాన్ని వృథాచేస్తున్నాం’ అన్నారు. 

కానీ రాజు మాత్రం ‘స్నేహితులారా, అలా నిరుత్సాహపడవద్దు ప్రయత్నించండి. కాదంటే మనం ఆకలిదప్పులతో నాశనమవుతాం... ఉత్సాహం కోల్పోవద్దు’ అన్నాడు. అతను అలా అన్నాడో లేదో, రాయి పగిలి గుంత ఏర్పడింది. దానిపై చెవిపెట్టి  అడుగున నీటి రొద విన్నాడు. వెంటనే తవ్వుతున్న కుర్రాణ్ణి పిలిచి, ఇదిగో ఈ గొడ్డలి తీసుకుని రాయిని బద్దలుకొట్టు’ అని ఉత్సాహపరిచాడు. అది పగిలింది. వెంటనే ఎగజిమ్ముతూ నీరు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయాడా కుర్రాడు. అంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఆ నీటిని తాగారు, స్నానం చేశారు. పశువులకి స్నానం చేయించారు. వంట చేసుకుని తిన్నారు.  బయలుదేరే ముందు అక్కడ నీళ్లున్నాయన్న సంగతి అందరికీ తెలిసేలా ఓ ధ్వజం పాతారు. వారి సురక్షితంగా ముగించారు


logo