బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Aug 31, 2020 , 23:28:57

ఓనంలో ఉల్లాసంగా..

ఓనంలో ఉల్లాసంగా..

ప్రణయబంధంలోని మధురిమల్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు దర్శకనాయిక ద్వయం విఘ్నేశ్‌ శివన్‌, నయనతార. గత నాలుగేళ్లుగా ఈ జంట నిర్విఘ్నంగా ప్రేమాయణాన్ని సాగిస్తోన్న విషయం తెలిసిందే. తమ అనుబంధాన్ని చాటే ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పంచుకుంటూ అభిమానుల్ని అలరిస్తుంటుందీ జోడీ. సోమవారం తన స్వస్థలం కొచ్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓనం వేడుకలో పాల్గొంది నయనతార. ఇందులో విఘ్నేశ్‌ కూడా భాగమయ్యారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి చెన్నైలో ఉంటున్న వారిద్దరు ఓనం ఉత్సవం కోసం సోమవారం కేరళకు వచ్చారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రేమికులిద్దరూ సంప్రదాయ కేరళ వస్ర్తాల్ని ధరించి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. logo