మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Aug 31, 2020 , 23:29:00

దేశం వజ్రాన్ని కోల్పోయింది

దేశం వజ్రాన్ని కోల్పోయింది

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ రాజకీయవేత్త ప్రణబ్‌ ముఖర్జీ మరణం పట్ల అగ్ర హీరో చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా సంతాపం ప్రకటించారు. ‘ప్రణబ్‌ముఖర్జీగారి మరణం నన్నెంతగానో కలచివేసింది. ఆయనతో జరిపిన చర్చలు, పంచుకున్న అనుభవాలు ఎంతో విలువైనవిగా భావిస్తున్నా.  అపారమేథోసంపత్తి కలిగిన గొప్ప జ్ఞానిగా భారతీయ రాజకీయాలపై ఆయన చెరగని ముద్రను వేశారు. ప్రణబ్‌ ముఖర్జీ మృతితో దేశం ఓ వజ్రాన్ని కోల్పోయింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.logo