శుక్రవారం 23 అక్టోబర్ 2020
Zindagi - Aug 30, 2020 , 23:36:04

అదిరేటి డ్రెస్సు మీరేస్తే..

అదిరేటి డ్రెస్సు మీరేస్తే..

ఇండియాలోనే ‘మోస్ట్‌ లవబుల్‌ కపుల్‌' ఎవరంటే వెంటనే వచ్చే సమాధానం.. ‘విరుష్క’ జోడి అనే! టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ తార అనుష్క శర్మ నడుమ ప్రేమ మొదలు పెండ్లి దాకా ప్రతివార్త కూడా అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క దంపతులు ఇటీవలే మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో తమ జీవితంలోకి ఓ చిన్నారి రానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ఫొటోను కూడా షేర్‌ చేశారు. ఎప్పట్లాగే ఈ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. కోహ్లీ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేసిన విరుష్క దంపతుల ఫొటో ఇప్పటికే కోటికిపైగా లైకులను దక్కించుకున్నది. అయితే ఇక్కడ మ్యాటర్‌ ఒక్క ఫొటో మాత్రమే కాదు.. ఆ ఫొటోలో అనుష్క శర్మ వేసుకున్న డ్రెస్‌ కూడా అంతే వైరల్‌ అవుతున్నది. నలుపు రంగు మీద తెల్లని చుక్కలతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ ఫుల్‌ స్లీవ్స్‌ డ్రెస్‌, ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచేస్తున్నది. అందుకే, ఈ డ్రెస్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. అంతేమరి.. రోజుకో కొత్తపుంతలు తొక్కే ఫ్యాషన్‌ ప్రపంచంలో ఏ డ్రెస్‌కు ఎక్కడ..? ఎలా..? పబ్లిసిటీ వస్తుందో ఎవరికి మాత్రం తెలుసు!


logo