మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 29, 2020 , 23:15:17

బక్క బతుకుల గొంతుక

బక్క బతుకుల గొంతుక

ఆ యువకుడి గొంతు వలస జీవుల కష్టాల కన్నీళ్లయి వర్షిస్తున్నది. ఆ గాత్రం ఆకలి డొక్కల్లోని పేగుల గర్జనలై ఉరుముతున్నది. అతడు విప్లవకారుడు కాదు.. ప్రఖ్యాత గాయకుడు కూడా కాదు. కానీ అతడి వెతుక్కుంటూ బాలీవుడ్‌ చిత్రపరిశ్రమే స్వయంగా వచ్చి తలుపుతట్టింది. ఆ గొంతు అరువు ఇస్తే కాసుల గలగలలో ముంచి తేలుస్తామని ఆఫర్‌ ఇచ్చింది. కానీ తన గొంతు ఎప్పుడూ బక్కజీవుల కష్టాలను ప్రపంచానికి చాటేందుకే పలుకుతుందని చెప్పి బంగారు అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదులుకున్నాడు. అతడే ఒడిశాలోని కలహండి ప్రాంతానికి చెందిన ర్యాపర్‌, మట్టిలో మాణిక్యం దులేశ్వర్‌ తండి. అతడు రూపొందించిన ‘టెల్లింగ్‌ ది ట్రుత్‌' వీడియో బాలీవుడ్‌తోపాటు సంగీత ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. దులేశ్వర్‌ కరోనా కారణంగా వలస కూలీల కష్టాలనే తన పాట వస్తువుగా మలుచుకున్నాడు. అతడి వీడియోలను బాలీవుడ్‌ నటులు ప్రియాంకా చోప్రా, రిచా చద్దా తదిరులు ఎంతో మెచ్చుకొని సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. దాంతో పలువురు సినిమా నిర్మాతలు అవకాశాలు ఇస్తామని దులేశ్వర్‌ను సంప్రదించారు. కానీ తాను తన మార్గంలోనే వెళతానని నిక్కచ్చిగా చెప్పేశాడు.  logo