మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 27, 2020 , 23:13:58

ఎలుక- సింహం

ఎలుక- సింహం

అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది.  ఒక మధ్యాహ్నం అది నిద్రపోతుండగా ఒక ఎలుక వచ్చింది. దాని దగ్గర కిసకిస శబ్దం చేసింది. దీంతో మేలుకున్న సింహం దాన్ని పట్టుకుంది. ‘ అల్పాహారంగా బాగున్నావు. నిన్ను తినేస్తా’ అని సింహం నోరు తెరిచింది.  సింహం ఉద్దేశాన్ని గ్రహించిన ఎలుక ‘ ఓ రాజా, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగూ ఆకలి తీరదు.  నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు సాయపడుతాను’ అంటూ  ప్రాధేయపడింది. ‘నువ్వు నాకు ఎలా అక్కెరకు వస్తావులే’ అంటూ ఎలుకను వదిలేసింది.   కొద్ది రోజులకు సింహం అడవిలో తిరుగుతూ ఉండగా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఎంతకూ అది బయటకు రాలేకపోయింది.  అప్పుడు గట్టిగా గర్జించింది. సింహం అరుపులకు అడవి అంతా దద్దరిల్లింది.

 జంతువులు అన్నీ దడుసుకున్నాయి. అప్పుడే అటుగా వెళ్తున్న ఎలుక సింహాన్ని గమనించింది.  సింహం దగ్గరకు వచ్చింది. ‘అయ్యో రాజా..  మీకేమైంది ఇలా చిక్కుకున్నారు’ అని అడిగింది. ‘ ఓ వేటగాడు మాటు వేశాడు. నేను ప్రమాదవశాత్తు ఇందులో చిక్కుకున్నాను. సాయంత్రంలోపు అతడు వచ్చేలా ఉన్నాడు. ఆలోపు నేను తప్పించుకోకపోతే అంతే సంగతులు’ అని చెప్పింది. ఎలుకకు వెంటనే ఉపాయం తట్టింది  మీరు కంగారు పడకండి. నేను మిమ్నల్ని విడిపించగలను’ అని భరోసా ఇచ్చింది. ఎలుక మాటలకు సింహం ఆశ్చర్యపోయింది. ‘ఎలా విడిపించగలవు’ అని ప్రశ్నించింది. ‘రాజా.. నేను చూడడానికి చిన్నగా ఉన్నా నా పండ్లు మాత్రం చాలా పదునైనవి, చాలా వస్తువులను నేను కొరికేయగలను. ఇప్పుడు ఈ వలను కొరకడం నాకు పెద్ద పని కాదు’ అని సమాధానం ఇచ్చింది. సింహానికి ప్రాణాలు లేచివచ్చాయి. ఎలుక కొద్ది క్షణాల్లోనే వలను మొత్తం కొరికేసి సింహాన్ని తప్పించింది. ఎలుక చేసిన సాయానికి సింహం కృతజ్ఞతలు చెప్పింది. ఆ రోజు తాను ఎలుకను తినకుండా వదిలేయడం వల్లే.. ఈ రోజు బయటపడగలిగాను అని గుర్తు చేసుకుంది సింహం. 


logo