శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Aug 27, 2020 , 22:55:08

అంతరిక్షంలోకి నల్ల కలువ

అంతరిక్షంలోకి నల్ల కలువ

అమెరికాకు చెందిన మహిళా వ్యోమగామి జీనెత్‌ ఎప్స్‌, సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో సేవలు అందించనున్న తొలి నల్లజాతి మహిళగా తన పేరును లిఖించుకోబోతున్నది. ఈ మేరకు అగ్రరాజ్య అంతరిక్ష సంస్థ ‘నాసా’, 2021లో చేపట్టనున్న అంతరిక్ష యాత్ర కోసం జీనెత్‌ పేరును ఖరారు చేసింది. ఐఎస్‌ఎస్‌లో సునీత విలియమ్స్‌, జోష్‌ కస్సాడాతో కలిసి ఆరు నెలల పాటు పనిచేయనున్నది. 1992లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన జీనెత్‌, మేరీల్యాండ్‌ యూనివర్సిటీ నుంచి ఏరో స్సేస్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసింది. ఆ తర్వాత ‘నాసా’లో సేవలు అందిస్తున్నది. అయితే, 2018లోనే రష్యాకు చెందిన సోయూజ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా జీనెత్‌కు అంతరిక్ష యాత్ర చేసే అవకాశం వచ్చినా, చివరి నిమిషంలో చేజారింది. తాజాగా, అంతరిక్ష యాత్ర కోసం నాసా తనను ఎంపిక చేయడంపై జీనెత్‌ ట్విటర్‌ ద్వారా హర్షం వ్యక్తం చేసింది. సునీత విలియమ్స్‌, జోష్‌ కస్సాడాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెబుతున్నది. logo