సోమవారం 19 అక్టోబర్ 2020
Zindagi - Aug 27, 2020 , 01:27:16

సింహం- స్నేహం

సింహం- స్నేహం

ఒక ఊరిలో ఒక వడ్రంగి ఉండేవాడు. అతడు  రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చుకొని, వాటిని అమ్మి ఆ డబ్బుతో జీవనం కొనసాగించేవాడు. ఓ రోజు అతనికి సింహం ఎదురైంది. దాన్ని చూసి  వడ్రంగి గజగజ వణుకుతూ నిలబడ్డాడు. అప్పుడు సింహం ‘నీవెందుకు భయపడుతున్నావు? నిన్ను ఏమీ చేయలేదు కదా’ అన్నది. వడ్రంగి కొంత ధైర్యం తెచ్చుకొని అతని దగ్గర ఉన్న ఆహారం  సింహం ముందు పెట్టాడు. ఆనాటి నుంచి వడ్రంగి, సింహం మంచి స్నేహితులయ్యారు. అతడు  రోజూ రుచికరమైన భోజనం పెట్టసాగాడు.  

కొన్ని రోజుల తర్వాత  సింహానికి ఒక కాకి, నక్కతో స్నేహం ఏర్పడింది. అది  వడ్రంగి గురించి గొప్పగా చెప్పింది. ఒకనాడు వడ్రంగికి  సింహం తన స్నేహితులిద్దరినీ పరిచయం చేసింది. వడ్రంగి సింహంతో ‘మిత్రమా! ఉన్నతులూ, ఉత్తములూ అయిన వారితోనే స్నేహం చేయాలి. నీవు మృగరాజువని నీతో స్నేహం చేశాను. కానీ,  నీవు నీ కన్నా తక్కువ జాతివారైన నక్క, కాకితో స్నేహం చేశావు. దీనితో నీ గొప్పతనం దిగజారిపోయింది. పైగా ఈ నక్క జిత్తుల మారిది, కాకి అరిష్టానికి పేరు పొందింది. కాబట్టి ఇకనుంచి నేను నీతో స్నేహం చేయను’ అని చెప్పాడు. అప్పుడు సింహం స్పందిస్తూ.. ‘ ఏ జాతి భేదం లేకుండా నేను నీతో స్నేహం చేశాను. నిజానికి నిన్ను చంపి ఆహారంగా తీసుకోవాలి. కానీ, నీలో మంచితనం ఉందని స్నేహం చేయసాగాను. కాకీ, నక్కా అడవి జీవులు వాటితో స్నేహం చేయడంలో నాకు ఎలాంటి  అభ్యంతరం లేదు. కానీ నువ్వు భేదం చూపిస్తున్నావు’ అని సింహం తేల్చి చెప్పింది.  దీంతో వడ్రంగి  అక్కడి నుంచి తలదించుకొని వెళ్లిపోయాడు..

నీతి-  స్నేహం  చేయడానికి ఎలాంటి భేదమూ చూడరాదు


logo