శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Aug 26, 2020 , 23:12:18

సోషల్‌ మీడియా క్వీన్‌.. షకీరా

సోషల్‌ మీడియా క్వీన్‌.. షకీరా

కొలంబియాకు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ షకీరా, సామాజిక మాధ్యమాల్లో తిరుగులేని మహిళగా దూసుకెళ్తున్నది. మత్తెక్కించే మధుర గాత్రంతోపాటు తన అద్భుతమైన నృత్యాభినయంతోప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. 43 ఏండ్ల ఈ గాయని, ఇప్పటికే మూడు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డులతోపాటు అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఏకంగా మూడుకోట్ల మంది సబ్‌స్ర్కైబర్లను సంపాదించుకున్నది. యూట్యూబ్‌ గ్లోబల్‌ టాప్‌ ఆర్టిస్టుల్లో ఒకరిగా నిలిచింది. ఇంతకుముందే మరో సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్‌లోనూ ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఫేస్‌బుక్‌ చరిత్రలోనే 10 కోట్ల లైకులు సంపాదించుకున్న తొలి సెలబ్రిటీగా ఖ్యాతికెక్కింది.