మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 25, 2020 , 22:48:26

పోరాటం ఆపొద్దు

పోరాటం ఆపొద్దు

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపొటిజం   హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్నది. వారసత్వంగా ఇండస్ట్రీలోకి వస్తున్న వారు.. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేనివారిని తొక్కేస్తున్నారని పలువురు బాలీవుడ్‌ నటులు బాహాటంగానే విమర్శిస్తూ, నెపొటిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సినీ పరిశ్రమలో వివక్షకు వ్యతిరేకంగా నటి కంగనా రనౌత్‌ కూడా కొన్ని రోజులుగా గొంతెత్తుతున్నారు. ప్రస్తుతం ఆమె పోరాటానికి సుశాంత్‌ సోదరి శ్వేతాసింగ్‌ క్రితి అండగా నిలిచింది. కంగనాపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ఎన్ని విమర్శలు ఎదురైనా బలంగా ఉండాలని, నెపొటిజంపై మరింతగా పోరాడాలని కంగనాకు ట్విటర్‌ ద్వారా పిలుపునిచ్చింది. నెపొటిజంపై సమగ్ర విచారణ చేపట్టాలని శ్వేతాసింగ్‌ కూడా కోరుతున్నది. ఈ విషయమై ఇప్పటికే ప్రధానికి లేఖ కూడా రాసింది. సుశాంత్‌ మరణం వెనుక ఉన్న నిజం బయటకు రావాలన్న కోరికే తప్ప, తామేమీ ఆశించడం లేదని శ్వేతా సింగ్‌ చెబుతున్నది. తమ కుటుంబంతోపాటు యావత్‌ ప్రపంచం మొత్తం వాస్తవాలు తెలుసుకునేలా సహకరించాలని అధికారులను, ప్రభుత్వాలను కోరుతున్నది. 


logo