గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 20, 2020 , 22:04:16

వినాయక పత్రం ఆరోగ్యదాయకం

వినాయక పత్రం ఆరోగ్యదాయకం

గణపతి పూజలో స్వామికి సమర్పించే ప్రతి పత్రమూ.. ఔషధ సమానమే! ప్రకృతి ప్రసాదించిన ఈ పత్రాలను దైనందిన జీవితంలో సరిగ్గా ఉపయోగించుకోగలిగితే రుగ్మతలు దరి చేరవు. విష్ణుక్రాంతం, శమీ పత్రం, గండకీ పత్రాల గుణగణాలు తెలుసుకుందాం.

విష్ణుక్రాంత పత్రం:

ఇది త్రిదోషాలనూ హరిస్తుంది. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.  సుఖనిద్రను కలిగిస్తుంది. విష్ణుక్రాంత పత్రాల రసం.. రక్తస్రావాన్ని అరికడుతుంది. ముక్కు నుంచి రక్తం కారినప్పుడు దీనిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. సంధి శూల (కీళ్ల నొప్పులు) నియంత్రణకు బాగా పనిచేస్తుంది. దీని కషాయం మూత్ర సంబంధ వ్యాధులను నివారిస్తుంది.

శమీ ప్రతం (జమ్మి ఆకు):

కఫ, పిత్తాలను సమాన స్థాయిల్లో ఉంచుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. శరీరంలోని కొవ్వులను సమాన స్థాయిలో ఉంచుతుంది. నొప్పులు నివారిస్తుంది. బలాన్నిస్తుంది. ఈ చెట్టు బెరడులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

గండకీ పత్రం (దేవ కాంచనము): 

కఫ, పిత్తాలను సమ్యావస్థలో ఉంచుతుంది. థైరాయిడ్‌ సంబంధిత రుగ్మతల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. అతి స్థౌల్యాన్ని (స్థూలకాయం) తగ్గిస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ డయాబెటిక్‌ గుణాలున్నాయి. ఈ పత్రాల రసం క్రిములను హరిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది.

ప్రొఫెసర్‌  

డాక్టర్‌ ఎం. రాజ్యలక్ష్మి

ఆయుర్వేద వైద్య నిపుణులు

ఆయుర్‌కల్ప, 

కొండాపూర్‌, హైదరాబాద్‌


logo