మంగళవారం 27 అక్టోబర్ 2020
Zindagi - Aug 19, 2020 , 23:21:07

అహంకారి పతనం..

అహంకారి పతనం..

సింహపురి అని రాజ్యానికి శివదత్తుడు అనే రాజు ఉండేవారు. అతనికి అహంకారం ఎక్కువ. ఒక రోజు రాజు వేటకు వెళ్లాడు. అక్కడ దైవానుగ్రహం పొందిన నెమలి, పావురం, సీతాకోక చిలుకలు రాజుకు కనిపిస్తాయి. వాటిని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తాడు. ఈ ప్రయత్నంలో వాటితో పాటు, రాజు కూడా ప్రాణాలు కోల్పోతాడు.  నెమలి, సీతాకోక చిలుక, పావురం చనిపోవడానికి కారణం రాజే కావడం వల్ల ఆ రాజ్యం శాపగ్రస్తమవుతుంది. కొద్ది రోజులకే కరువు వాటిల్లుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందుల నడుమ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది.  ఈ క్రమంలో ఓ రుషి రాజ్యానికి వస్తాడు. 

అక్కడి  పరిస్థితిని గమనిస్తాడు. రాజ్యంలోని మిగిలిన  జనాన్ని కలిసి, అసలు విషయం తెలుసుకుంటాడు.  పరిష్కారంగా  ‘ ఆ రాజు సమాధి మీద నెమలి, పావురం, సీతాకోక చిలుక కలయికతో ఒక సింహాసనం చేసి ప్రతిష్ఠించమని’ చెప్తాడు. ఆ సింహాసనం ఎలా ఉండాలో కూడా రుషి వివరిస్తాడు. అహంకార స్వభావం గల రాజు తనకుసాటి ఎవరూ లేరని ఇలా చేశాడు కాబట్టి తన సమాధి మీద ఈ సింహాసనాన్ని ప్రతిష్ఠించాలని రుషి చెప్తాడు. అనుకున్నట్టుగానే రాజ్యంలోని ప్రజలు సమాధిపై సింహాసనాన్ని ప్రతిష్ఠిస్తారు. కొద్ది రోజుల్లోనే వర్షం కుండపోతగా కురుస్తుంది. కరువు నుంచి రాజ్యం  విముక్తి అవుతుంది. అహంకారి పతనం ఎప్పుడూ విజయుడి కింద ఉంటుందని అని రుషి ప్రజలకు హితవు పలుకుతాడు. ఆ మాటల్లో మర్మమెరిగి ప్రజలు జీవిస్తారు. logo