మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 18, 2020 , 22:39:18

వినాయకుని నైవేద్యం ఉండ్రాళ్ళు ఇలా చేసుకుందాం...

వినాయకుని నైవేద్యం ఉండ్రాళ్ళు ఇలా చేసుకుందాం...

కావలసిన పదార్థాలు 

  • బియ్యపు రవ్వ : ఒకటిన్నర గ్లాసు
  • శనగపప్పు : పావు గ్లాసు
  • ఉప్పు : ఒకటిన్నర టీ స్పూన్స్‌
  • నీళ్ళు : మూడు గ్లాసులు
  • జీలకర్ర : స్పూను

తయారు చేసే విధానం 

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మూడు గ్లాసుల నీళ్ళు పోసి స్టవ్‌ మీద పెట్టి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో జీలకర్ర, పచ్చి శనగపప్పు వేసి రెండు పొంగులు రానివ్వాలి. తర్వాత పొంగుతున్న నీళ్లలో ఉప్పువేసి మళ్లీ ఒక పొంగు రానిచ్చి బియ్యపు రవ్వను పోసిఉండ కట్టకుండా దగ్గర పడేదాకా కలిపి మూతపెట్టాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి రవ్వ మెత్తగా ఉడికిందో లేదో చూడాలి. ఉడికిన రవ్వను స్టవ్‌ మీద నుంచి దించేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన రవ్వను ఉండలుగా చేసి ఒక గిన్నెలో గ్లాసున్నర నీళ్లు పోసి గిన్నెపై చిల్లుల పళ్లెం పెట్టి అందులో ఉండ్రాళ్లు పెట్టుకొని గిన్నెపై మూతను పెట్టి ఆవిరి మీద ఒక్క పదినిమిషాలు ఉడకనివ్వాలి. అంతే! ఎంతో రుచికరమైన ఉండ్రాళ్లు రెడీ. ఈ ఉండ్రాళ్లు కొత్తిమీర చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.logo