గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 18, 2020 , 22:36:36

అంఖీ దాస్‌..

అంఖీ దాస్‌..

భారత్‌ సహా దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాలకు ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ‘అంఖీ దాస్‌' పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నది. ఈమె 2011 నుంచి ఫేస్‌బుక్‌ సంస్థలో పనిచేస్తున్నారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్‌ సంస్థలోనూ పబ్లిక్‌ పాలసీ హెడ్‌గానూ విధులు నిర్వహించారు. భారతదేశంలో కొందరు నాయకులు ఫేస్‌బుక్‌ వేదికగా చేస్తున్న ద్వేశపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను.. ఆ సంస్థ చూసీ చూడనట్లు వదిలేస్తున్నదని, అంఖీ దాస్‌ నిర్ణయం వల్లే ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకోవడంలేదని ‘ద వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వివాదం చెలరేగడంతో అంఖీదాస్‌ స్పందించారు. చాందసవాదాన్ని ప్రోత్సహించే వారిని ఫేస్‌బుక్‌ వేదికను వాడుకోనివ్వమనీ, దీనికి తమ సంస్థ ఎప్పటికీ కట్టుబడే ఉంటుందని చెబుతున్నారు. 


logo