మంగళవారం 20 అక్టోబర్ 2020
Zindagi - Aug 18, 2020 , 00:44:13

ఎలిజబెత్‌ క్యాడీ స్టాన్‌టన్‌..

ఎలిజబెత్‌ క్యాడీ స్టాన్‌టన్‌..

ప్రజాస్వామ్యంలో ‘ఓటు’ అనేది వజ్రాయుధం. మంచి నాయకున్ని ఎన్నుకోవాలంటే ఓటేయడం అత్యంత కీలకం. అయితే, ప్రపంచంలోని అనేక దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు అనేది మొదట్నుంచీ లేదు. తాము కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వాములం  అవుతామనీ, తమకూ ఓటు హక్కు కల్పించాలని అనేక మంది మహిళలు పోరాడారు. ముఖ్యంగా అమెరికాలో మహిళల ఓటు హక్కు కోసం పోరాడినవారిలో ఎలిజబెత్‌ క్యాడీ స్టాన్‌టన్‌ ముఖ్యులు. ఈమె రిపబ్లికన్‌ పార్టీ సహ వ్యవస్థాపకుడైన హెన్రీ బ్రూస్టర్‌ స్టాన్‌స్టన్‌ భార్య. సామాజిక ఉద్యమకారిణి. మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు. అగ్రరాజ్యంలో మహిళలకు ఓటు హక్కు కల్పించి 100 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఎలిజబెత్‌ క్యాడీ స్టాన్‌టన్‌' మరోసారి వార్తల్లోకి ఎక్కారు. logo