గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 18, 2020 , 11:49:30

క్యాబేజీ పెసర వడలు

క్యాబేజీ పెసర వడలు

కావలసిన పదార్థాలు 

పెసర్లు : 150 గ్రా.

క్యాబేజి : 150 గ్రా.

ఉల్లిపాయలు : రెండు

పచ్చిమిర్చి : 6

కరివేపాకు : మూడు రెమ్మలు

పుదీన : పావు కప్పు

శనగపిండి : రెండు స్పూన్లు

అల్లం : చిన్న ముక్క

జీలకర్ర : పావు స్పూను

నూనె : 200 మి.లీ.

తయారు చేసే విధానం

మొదట పెసర్లను తగినన్ని నీళ్లలో మూడు గంటలసేపు నానపెట్టుకోవాలి. తర్వాత నీళ్లు వంపేసి పెసర్లను నీళ్లు పోయకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఓ గిన్నెలోకి తీసుకొని అందులో తరిగిన క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పుదీన వేసి బాగా కలుపుకోవాలి. శనగపిండి, జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని చేత్తో పిండి వడలుగా వేయటానికి అనుగుణంగా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి బాగా కాగిన తర్వాత.. పిండిని ఉండలుగా చేసుకొని అర చేతితో చిన్న వడలుగా చేసుకొని నూనెలో వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ పెర్ర మసాలా వడలు రెడీ!


logo