శనివారం 31 అక్టోబర్ 2020
Zindagi - Aug 17, 2020 , 01:59:31

వినాయక పత్రం- ఆరోగ్యదాయకం

వినాయక పత్రం- ఆరోగ్యదాయకం

వినాయకుడి పూజలో ఉపయోగించే 21 పత్రాల్లో ఈ నాలుగు పత్రాల మొక్కలు మనందరికీ తెలిసినవే. మన చుట్టు పక్కల పెరిగేవే. వీటిలో ఉండే ఔషధ గుణాలివే..

కరవీర పత్రం (గన్నేరు)

ఇది కఫ, వాతాలను సమతుల్యంగా ఉంచుతుంది. నొప్పి నివారణి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్‌ చికిత్సలోనూ దీన్ని ఉపయోగిస్తుంటారు. బ్యాక్టీరియా, ఫంగస్‌ క్రిములను నాశనం చేస్తుంది. 

తులసీ పత్రం

కఫ, వాతాలను నియంత్రించడంలో తులసి కీలకమైంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. క్రిములను నాశనం చేస్తుంది. చర్మవ్యాధులు, శ్వాస సంబంధిత రోగాలను తగ్గిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. వ్రణాలను నయం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనను ఉపశమింపచేస్తుంది. వైరస్‌ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. జ్వరానికి ఇది మంచి మందు. దీనిలో విటమిన్‌ సి ఉంటుంది. యుజెనాల్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చూత పత్రం (మామిడి)

వాత, పిత్త, కఫాలను సమాన స్థాయిలో ఉంచేందుకు దోహదం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్రణాలను మాన్పుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. అతిసార వ్యాధికి మంచి మందు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దత్తూర పత్రం (ఉమ్మెత్త)

కఫ, వాతాలను సమతుల్యం చేస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. వికారం, తలతిరగడాన్ని దీనితో తగ్గించవచ్చు. వాపు, నొప్పి నివారణలో ఉపయోగపడుతుంది. ఆస్తమా, ఇతర శ్వాస సమస్యలకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. జ్వరం, తలనొప్పి తగ్గుతాయి. దురద, ఇతర చర్మ సమస్యలను కట్టడి చేస్తుంది.