శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Aug 17, 2020 , 01:59:30

బ్యూనా వెంచురా

బ్యూనా వెంచురా

యూకేలోని సల్ఫార్డ్‌ రాయల్‌ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్న 26 ఏండ్ల బ్యూనావెంచురా. కరోనా వార్డులో విధులు నిర్వర్తించేది. ఓ రోజు కాలి నొప్పి మొదలైంది. పట్టించుకోలేదు. రోజులు గడిచే కొద్దీ బాధ తీవ్రమైంది. 8 వారాలు నొప్పిని భరిస్తూనే విధులకు హాజరైంది. తర్వాత పరీక్షల్లో సర్కోమా ఉన్నట్లు తేలింది. కాలులో గోల్ఫ్‌ బంతి సైజు కణతి ఉందని గుర్తించారు వైద్యులు. శస్త్రచికిత్స చేసి మోకాలి పైవరకూ కాలును తొలగించారు. ఇన్నాళ్లూ నొప్పి ఎలా భరించావని అడిగితే.. ‘ప్రాణాలతో పోరాడుతున్న కరోనా బాధితులకు నా అవసరం ఉందనిపించింది. అందుకే నా ఇబ్బందిని అంతగా పట్టించుకోలేద’ని చెప్పుకొచ్చింది బ్యూనావెంచురా. ఇప్పుడు ఆమెకు కృత్రిమ కాలును అమర్చారు. నవంబర్‌లో తిరిగి విధులకు హాజరవుతానంటున్నదామె. 


logo