శనివారం 24 అక్టోబర్ 2020
Zindagi - Aug 17, 2020 , 01:59:30

టమాట దోసెలు

టమాట దోసెలు

కావలసిన పదార్థాలు :

మినప్పప్పు : కప్పు

బియ్యం  : రెండున్నర కప్పులు 

ఉప్పు : తగినంత

టమాటలు : 4

ఎండుమిర్చి : 5

జీలకర్ర : అర చెంచా

తయారు చేసే విధానం :మాములుగా దోసెల పిండి అంటే కప్పు మినప్పప్పులోకి రెండున్నర కప్పుల బియ్యం వేసి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నీళ్ళు వడగట్టి మెత్తగా గ్రైండ్‌ చేసుకొని తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలను ముక్కలుగా తరగాలి. టమాట ముక్కలు, ఎండు మిరపకాయలు, ఒక స్పూను జీలకర్ర మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. దోసెల పిండిలో ఈ మిశ్రమాన్ని వేసుకొని గరిటతో బాగా కలుపుకొని, పెనం మీద పలుచగా దోసెలాగా వేసుకోవాలి. అవసరమైతే ఒక ఉల్లిపాయ, రెండు పచ్చి మిరపకాయలు సన్నగా తురుముకొని ఈ దోసెలపై వేసుకోవచ్చు. ఈ దోసెలు కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.


logo