గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 15, 2020 , 23:56:22

అనురాధ

అనురాధ

మహిళల టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత నమోదు చేసింది భారత సంతతికి చెందిన మీడియం పేసర్‌ అనురాధ దొడ్డబళ్లాపుర్‌. కర్ణాటకకు చెందిన ఈ పేసర్‌ ప్రస్తుతం జర్మనీ మహిళా క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించింది. ఇలా వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా రికార్టు సృష్టించింది. పురుషుల క్రికెట్‌లో శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ, ఆఫ్ఘాన్‌ బౌలర్‌ రషీద్‌ఖాన్‌ ఈ ఫీట్‌ సాధించారు.logo